తెలంగాణ

telangana

ETV Bharat / state

యాగాలు చేస్తే బంగారు తెలంగాణ సాధ్యం కాదు - cm

ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన యాగాలు ఆయన కుటుంబం కోసం, పార్టీ కోసమేనని ఎమ్మెల్యే రాజాసింగ్ ధ్వజమెత్తారు. ఆయనకు హిందుత్వం అంటే ఎంటో తెలుసా అని ప్రశ్నించారాయన.

రాజాసింగ్, గోషమహల్ ఎమ్మెల్యే

By

Published : Apr 15, 2019, 6:57 PM IST

గోషల్​మహల్ ఎమ్మెల్యే రాజాసింగ్

కేసీఆర్​కు అసలు హిందుత్వం అంటే ఎంటో తెలుసా అంటూ మండిపడ్డారు గోషల్​మహల్ ఎమ్మెల్యే రాజాసింగ్. దేశంలో పెద్దమొత్తంలో పాపాలు మూటగట్టుకున్న ముఖ్యమంత్రి కేసీఆరేనని ఎద్దేవా చేశారు. వేల సంఖ్యలో ఆవు, దూడ మాంసం పక్కరాష్ట్రాలకు ఎగుమతి అవుతున్నా పట్టించుకోవట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సంప్రదాయాల గురించి సీఎం మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. హిందువులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఓవైసీ బ్రదర్స్​ వెంట వేసుకుని తిరుగుతున్నారని విమర్శించారు. దమ్ముంటే అయోధ్య రామమందిర నిర్మాణానికి మద్దతు పలికాలని సవాల్ విసిరారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ దేశంలోనే అతిపెద్ద యాగం చేసినా అని అంటుండు. అది ఎవరి కోసం చేసిండు. మీ పార్టీ, మీ కుటుంబం గురించి చేసిండ్రు. అంతే..అసలు హిందుత్వం అంటే ఎందో తెలుసా అని నేను అడుగుతున్నా? బంగారు తెలంగాణ చేస్తమని చెప్పి.. మత్తు తెలంగాణను తయారు చేశారు.
------ రాజాసింగ్, గోషమహల్ ఎమ్మెల్యే

ఇవీ చూడండి: మాయమైపోతున్నడమ్మా..మనిషన్నవాడు..

ABOUT THE AUTHOR

...view details