తెలంగాణ

telangana

ETV Bharat / state

తప్పుల తడకగా పీఆర్సీ నివేదిక: పీఆర్టీయూ - సంగారెడ్డి జిల్లా తాజా వార్తలు

పీఆర్సీ నివేదిక తప్పుల తడకగా ఉందని పీఆర్టీయూ నాయకులు అన్నారు. పీఆర్సీని వ్యతిరేకిస్తూ సంఘం ఆధ్వర్యంలో సంగారెడ్డి కలెక్టరేట్ ముందు నిరసన చేపట్టారు.

prtu leaders protest in sangareddy Collectorate against the PRC
పీఆర్సీ నివేదిక తప్పుల తడక: పీఆర్టీయూ నాయకులు

By

Published : Jan 28, 2021, 4:21 PM IST

పెరుగుతున్న నిత్యావసర ధరలకు అనుగుణంగా పీఆర్సీ ఇవ్వాలని... పీఆర్టీయూ నాయకులు డిమాండ్​ చేశారు. నివేదికను వ్యతిరేకిస్తూ సంఘం ఆధ్వర్యంలో సంగారెడ్డి కలెక్టరేట్ ముందు నిరసన చేపట్టారు. పీఆర్సీ నివేదిక తప్పుల తడకగా ఉందని వారు మండిపడ్డారు.

ఎంతో మంది త్యాగాల ఫలితంగా ఏర్పడిన రాష్ట్రంలో తమకు అన్యాయం జరగడం బాధాకరమని అన్నారు. తమ డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని పేర్కొన్నారు. లేకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం చేపట్టడానికి వెనకాడమని హెచ్చరించారు.

ఇదీ చదవండి: ఔత్సాహిక వ్యాపారవేత్తలకు అండగా నిలుస్తున్న ఫెక్కీ

ABOUT THE AUTHOR

...view details