సంగారెడ్డి జిల్లా పటాన్చెరు వద్ద 65వ నంబరు జాతీయ రహదారిపై కాంగ్రెస్, సీఐటీయూలు వేర్వేరుగా ధర్నాలు నిర్వహించాయి. భారత్ బంద్‌లో భాగంగా భారీగా నిరసనలు చేపట్టారు. మోదీ ప్రభుత్వ విధానాలను ఎండగడుతూ నినాదాలు చేశారు.
కాంగ్రెస్, సీఐటీయూల ఆధ్వర్యంలో జాతీయ రహదారిపై ధర్నా - patancheru updates on barath bundh
భారత్ బంద్ సందర్భంగా సంగారెడ్డి జిల్లా పటాన్చెరు వద్ద జాతీయ రహదారిపై కాంగ్రెస్, సీఐటీయూల ఆధ్వర్యంలో కార్యకర్తలు వేర్వేరుగా ధర్నా నిర్వహించారు. రైతు వ్యతిరేక చట్టాలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
కాంగ్రెస్, సీఐటీయూల ఆధ్వర్యంలో జాతీయ రహదారిపై ధర్నా
కేంద్ర ప్రభుత్వం రైతులకు మేలు చేయాల్సింది పోయి.. వ్యతిరేక విధానాలను అవలంబిస్తోందని వాపోయారు. ఇలాంటి చట్టాలను వెంటనే రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. కార్మికులు, కర్షకుల జీవితాలతో కేంద్రం ఆటలాడుకుంటోందని మండిపడ్డారు.