సంగారెడ్డి జిల్లాలో కొవిడ్-19 సంక్రమిత ప్రాంతాల్లో రాకపోకలను నిషేధిస్తున్నట్లు ఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. జిల్లాలోని జహీరాబాద్‌లో కరోనా పాజిటివ్ వచ్చిన కాలనీలలో ఆర్డీవో రమేష్ బాబుతో కలిసి పర్యటించారు. పట్టణంలోని 15 నుంచి 25వ వార్డు పరిధిలో కిలోమీటర్ మేర రవాణా పూర్తిగా నిషేధించాలని సూచించారు. కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తితో ప్రైమరీ కాంటాక్ట్స్ ఉన్న వ్యక్తులను ప్రభుత్వం క్వారంటైన్ సెంటర్లకు పంపినట్లు ఆర్డీఓ... ఎస్పీకి వివరించారు. రేయింబవళ్లు గస్తీ నిర్వహిస్తూ ప్రధాన మార్గాల్లో నిఘా పెంచాలని డీఎస్పీ గణపతి జాదవ్‌ను ఆదేశించారు.
నిషేధాజ్ఞలు కఠినం : ఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి - Sangareddy Jaheerabad Corona Positive
కరోనా ప్రబలుతున్న ప్రాంతాల్లో నిషేధాజ్ఞలు కఠినతరం చేస్తామని సంగారెడ్డి ఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. జిల్లాలోని జహీరాబాద్‌లో కరోనా పాజిటివ్ వచ్చిన ప్రాంతాల్లో ఆర్డీఓతో కలిసి ఆయన పర్యటించారు.
జహీరాబాద్‌లో కాలనీలను పరిశీలిస్తున్న ఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి