సంగారెడ్డి జిల్లా బొల్లారంలో ఓ ప్రైవేట్ పాఠశాల ప్రభుత్వ ఆదేశాలను బేఖాతరు చేసి వార్షికోత్సవం నిర్వహిచింది. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు సర్కారు మార్చి 31 వరకు విద్యాసంస్థలకు సెలవు ప్రకటించింది. ఈ ఉత్తర్వులను కచ్చితంగా పాటించాలని జిల్లా, మండల విద్యా శాఖ అధికారులను ఆదేశించింది. కానీ బొల్లారం మున్సిపాల్టీ పరిధిలోని ఓ ప్రైవేటు పాఠశాల ప్రభుత్వ ఉత్తర్వులు తమకు ఏమీ పట్టనట్లుగా... పాఠశాల వార్షికోత్సవాన్ని నిర్వహించింది. కార్యక్రమానికి విద్యార్థులు వారి తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
ప్రభుత్వ ఆదేశాలు బేఖాతరు చేసిన పాఠశాల - privet school violation government rules in Hyderabad
కరోనా వైరస్ ప్రబలకుండా రాష్ట్ర ప్రభుత్వం విద్యా సంస్థలకు మార్చి 31 వరకు సెలవు ప్రకటించింది. కానీ సంగారెడ్డి జిల్లా బొల్లారంలో ఓ ప్రైవేట్ పాఠశాల ప్రభుత్వ ఆదేశాలను బేఖాతరు చేసి వార్షికోత్సవం నిర్వహించింది.
![ప్రభుత్వ ఆదేశాలు బేఖాతరు చేసిన పాఠశాల privet school violation government rules in Hyderabad](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6447050-thumbnail-3x2-sdgsg.jpg)
ప్రభుత్వ ఆదేశాలు బేఖాతరు చేసిన పాఠశాల
TAGGED:
Violation