తెలంగాణ

telangana

ETV Bharat / state

విద్యార్థులను చితకబాదిన ప్రిన్సిపల్.. కారణం తెలిస్తే.! - విద్యార్థులను కొట్టిన ప్రిన్సిపాల్ తాజా వార్తలు

Principal beats students brutally in sangareddy : చెప్పకుండా బయటకు వెళ్లడమే ఆ విద్యార్థులు చేసిన నేరం. అందుకు ఆ కళాశాల ప్రిన్సిపల్​ వారిని కర్రతో వాతలొచ్చే వరకు చితకబాదాడు. సంగారెడ్డి జిల్లాలోని ఓ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

Principal beats students brutally in sangareddy
Principal beats students brutally in sangareddy

By

Published : Sep 20, 2022, 11:49 AM IST

Principal beats students brutally in sangareddy : అనుమతి లేకుండా బయట తిరుగుతున్నారని విద్యార్థులను ప్రిన్సిపల్ చితకబాదిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. సంగారెడ్డి జిల్లా కోహీర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థి పాండు అతని స్నేహితులు కళాశాలకు ఆలస్యంగా వచ్చారు. దీంతో ప్రిన్సిపల్ వెంకటేశ్వర్లు వారిని కర్రతో తీవ్రంగా చితకబాదాడు.

పాండుకు జ్వరంగా ఉండడంతో ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి వస్తున్నామని తోటివిద్యార్థులు చెప్పిన ప్రిన్సిపల్ పట్టించుకోలేదు. భుజం వీపు తొడలపై కర్రతో విచక్షణారహితంగా చితకబాదాడు. దీంతో తమ శరీరాలపై వాతలు వచ్చినట్లు బాధిత విద్యార్థులు వాపోయారు. ఆ నలుగురు విద్యార్థులు కళాశాలకు సరిగ్గా రావడం లేదని అడిగినందుకు తనను దుర్భాషలాడారని ప్రిన్సిపల్ వెంకటేశ్వర్లు తెలిపారు. అందుకే వారిని దండించానని ప్రిన్సిపల్ చెప్పుకొచ్చారు. ప్రిన్సిపల్​పై చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details