తెలంగాణ

telangana

ETV Bharat / state

MOdi at Icrisat: ఇక్రిశాట్‌ స్వర్ణోత్సవాల్లో ప్రధాని.. ఎయిర్​పోర్టులో ఘనస్వాగతం - Icrisat Golden Jubilee celebrations in Hyderabad

MOdi at Icrisat: హైదరాబాద్‌లో జరుగుతున్న ఇక్రిశాట్‌ స్వర్ణోత్సవాలకు ప్రధాని మోదీ హాజరయ్యారు. సాగు సంబంధిత ఎగ్జిబిషన్‌ను తిలకించిన ప్రధాని తిలకించారు. మోదీతో పాటు గవర్నర్ తమిళిసై, కేంద్రమంత్రులు నరేంద్రసింగ్‌ తోమర్‌, కిషన్ రెడ్డి పాల్గొన్నారు.

Prime Minister Modi in icrisat
ఇక్రిశాట్‌ స్వర్ణోత్సవాల్లో ప్రధాని మోదీ..

By

Published : Feb 5, 2022, 3:31 PM IST

MOdi at Icrisat: ఇక్రిశాట్‌ స్వర్ణోత్సవాలను భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. హైదరాబాద్‌లోని ఇక్రిశాట్‌ చేరుకున్న ప్రధాని ముందుగా సాగు సంబంధిత ఎగ్జిబిషన్‌ను తిలకించారు. ఈ సందర్భంగా ఇక్రిశాట్ డైరెక్టర్ జనరల్ జాక్వెలిన్ డి ఆరోస్ ప్రధానిని సన్మానించారు. మోదీతో పాటు గవర్నర్‌ తమిళిసై, కేంద్రమంత్రులు తోమర్‌, కిషన్‌రెడ్డి హాజరయ్యారు.

2 వేల మందితో భద్రత

మెట్ట పంటల పరిశోధనలను ఇక్రిశాట్‌ శాస్త్రవేత్తలు ప్రధానికి వివరించారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో ఇక్రిశాట్‌ వద్ద 2 వేల మందికిపైగా పోలీసులతో పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. ఇక్రిశాట్‌ ప్రధాన ద్వారం వద్ద ఒకవైపు మూసివేశారు. అనంతరం ముచ్చింతల్‌కు ప్రధాని మోదీ వెళ్లనున్నారు.

ఎయిర్​పోర్టులో ఘనస్వాగతం

ప్రధానికి స్వాగతం పలికేందుకు గవర్నర్‌ తమిళిసై, సీఎస్‌ సోమేశ్‌కుమార్, డీజీపీ మహేందర్‌ రెడ్డి శంషాబాద్‌ విమానాశ్రయానికి చేరుకున్నారు. అయితే అస్వస్థత కారణంగా సీఎం కేసీఆర్‌ ఈ కార్యక్రమానికి హాజరుకాలేదు.

ఇక్రిశాట్‌ స్వర్ణోత్సవాల్లో ప్రధాని..

ఇదీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details