సంగారెడ్డి కలెక్టరేట్లో ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ హనుమంతరావు ప్రజల నుంచి విజ్ఞప్తులు స్వీకరించారు. న్యాల్కల్ మండల కేంద్రానికి చెందిన రాజు అనే వికలాంగుడు... రోడ్డు విస్తరణలో భాగంగా తన కిరాణా కొట్టు తొలగించారని కలెక్టర్కు విన్నవించుకున్నాడు. విషయం తెలుసుకున్న పాలనాధికారి హనుమంతరావు... రాజుకి మరొక చోట సాయంత్రంలోగా కిరాణా కొట్టు ఏర్పాటు చేయించాలని సంబంధిత ఎమ్మార్వో, ఎంపీడీవోలకు ఆదేశించారు.
ప్రజావాణిలో బాధితుడి ఆవేదన... స్పందించిన కలెక్టర్ - collector hanumantharao help to physical handicapped raju
ప్రజావాణిలో కలెక్టర్ మానవత్వాన్ని చాటుకున్నారు. ఓ వికలాంగుడి ఆవేదనను విన్న ఆయన..సాయంత్రం లోగా కిరాణా కొట్టు ఏర్పాటు చేయించాలని ఎమ్మార్వో, ఎంపీడీఓను ఆదేశించారు.
ప్రజావాణిలో బాధితుడి ఆవేదన... స్పందించిన కలెక్టర్