జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాలను సంగారెడ్డిలో జిల్లా ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ ఘనంగా నిర్వహించింది. వారోత్సవాల్లో భాగంగా నేడు సంగారెడ్డి కలెక్టరేట్ నుంచి చౌరస్తా వరకు అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని డీఆర్ఓ రాధికా రమణి జెండా ఊపి ప్రారంభించారు.
'అవసరం లేనప్పుడు లైట్లు, ఫ్యాన్లు ఆపివేయాలి'
ప్రతి ఒక్కరు ఇంధనాన్ని పొదుపుగా వాడాలని సంగారెడ్డి జిల్లా డీఆర్ఓ రాధికారమణి సూచించారు. అవసరం లేనప్పుడు లైట్లు, ఫ్యాన్లు ఆపివేయాలని విజ్ఞప్తి చేశారు.
సంగారెడ్డిలో జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాల
ప్రతి ఒక్కరూ ఇంధనాన్ని పొదుపుగా వాడాలని డీఆర్ఓ రాధికా రమణి కోరారు. అధికారులు తమ కార్యాలయం నుంచి బయటకు వెళ్లే ముందు.. లైట్లు, ఫ్యాన్లను ఆపివేయాలని విజ్ఞప్తి చేశారు.
- ఇవీ చూడండి : 'పౌర' చట్టంపై సుప్రీంలో సవాల్: భాజపా మిత్రపక్షం