తెలంగాణ

telangana

ETV Bharat / state

సంగారెడ్డిలో ఈ నెల 13న ఫోక్సో ప్రత్యేక న్యాయస్థానం ప్రారంభం - Sanga reddy district latest news

సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని కోర్టులో ఫోక్సో ప్రత్యేక న్యాయస్థానాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు... జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాపిరెడ్డి తెలిపారు. ఈ నెల 13న ప్రత్యేక న్యాయస్థానాన్ని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ టి.అమర్​నాథ్ గౌడ్ ప్రారంభించనున్నారని అన్నారు.

Posco special court in Sangareddy district
ఈ నెల 13న పోక్సో ప్రత్యేక న్యాయస్థానం ప్రారంభించనున్నాం

By

Published : Feb 11, 2021, 11:51 AM IST

సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని జిల్లా కోర్టులో ఫోక్సో చట్టం కింద కేసుల విచారణకు ప్రత్యేక న్యాయస్థానం ఏర్పాటు చేయనున్నట్లు... జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాపిరెడ్డి తెలిపారు. సుప్రీంకోర్టు, హైకోర్టు ఆదేశాల మేరకు చిన్న పిల్లలపై జరిగే లైంగిక వేధింపులు, అత్యాచారాల కేసులు త్వరితగతిన విచారణ కోసం వీటి ప్రారంభానికి పూనుకున్నట్లు పేర్కొన్నారు.

ఈ నెల 13న హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ టి.అమర్​నాథ్ గౌడ్ ఫోక్సో ప్రత్యేక న్యాయస్థానాన్ని ప్రారంభించనున్నారని తెలిపారు. ఫోక్సో చట్టం కింద కేసుల్లో విచారణకు హాజరయ్యే చిన్న పిల్లలు ఉండటానికి ఒక ప్రత్యేక గదిని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. కోర్టు వాతావరణాన్ని ఆట స్థలం, ఆట బొమ్మలతో సిద్ధం చేశామన్నారు.

ఇదీ చదవండి: భాజపా మేయర్, డిప్యూటీ మేయర్ అభ్యర్థుల ప్రకటన

ABOUT THE AUTHOR

...view details