తెలంగాణ

telangana

ETV Bharat / state

పక్కా ప్రణాళిక... ప్రశాంతంగా పాలిసెట్​ పరీక్ష - corona virus latest news

సంగారెడ్డి జిల్లా పాలిసెట్​ పరీక్ష ప్రశాంతంగా జరుగుతోంది. పరీక్ష కేంద్రాల వద్ద అధికారులు విద్యార్థులను థర్మల్​ స్క్రీనింగ్​ చేసి లోనికి అనుమతించారు. విద్యార్థులు ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించేలా చర్యలు తీసుకున్నారు.

polycet exam in sangareddy district
పక్కా ప్రణాళిక... ప్రశాంతంగా జరుగుతోన్న పాలిసెట్​ పరీక్ష

By

Published : Sep 2, 2020, 12:21 PM IST

కరోనా ప్రభావంతో విద్యా విధానం రూపురేఖలు మారిపోయాయి. విద్యార్థుల విద్యా సంవత్సరం అతలాకుతలం అయ్యింది. విద్యార్థులు కొందరు తమ చదువును కొంత మర్చిపోయారు. కరోనా మహమ్మారి వల్ల పరీక్షలు వాయిదా పడ్డాయి. సంగారెడ్డి జిల్లాలో పక్కా ప్రణాళికతో పాలిసెట్​ పరీక్షను నిర్వహిస్తున్నారు.

విద్యార్థులు ప్రతి ఒక్కరు మాస్కులు ధరించి పరీక్షా కేంద్రాలకు హాజరయ్యారు. పరీక్షా కేంద్రాల వద్ద విద్యార్థులను థర్మల్​ స్క్రీనింగ్​ చేసి, చేతులు శానిటైజ్​ చేసుకున్న తర్వాత లోనికి అనుమతించారు. పరీక్షా కేంద్రాల వద్ద పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.

ఇవీ చూడండి:పక్కా ఏర్పాట్లు.. ప్రారంభమైన పాలిసెట్​

ABOUT THE AUTHOR

...view details