తన అభిమానులు చేసిన.. సేవా కార్యక్రమాలను కాంగ్రెస్ నాయకులు వక్రీకరించారని నారాయణ ఖేడ్ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి అన్నారు. కరోనా వైరస్ నేపథ్యంలో.. జన్మదిన వేడుకలకు తాను దూరంగా ఉన్నట్లు తెలిపారు. శ్రేయోభిలాషులు, అభిమానులు నిరుపేదలకు నిత్యావసర సరకుల పంపిణీ, రక్త దాన కార్యక్రమం నిర్వహించారని పేర్కొన్నారు.
"రాజకీయ దురుద్దేశంతో.. కాంగ్రెస్ అసత్య ప్రచారం" - Birthday celebrations of MLA Bhopal Reddy
దురుద్ధేశంగా కాంగ్రెస్ నేతలు అసత్య ప్రచారం చేస్తున్నారని నారాయణ ఖేడ్ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి మండిపడ్డారు. తన నియోజకవర్గంలో అభిమానులు చేసిన.. సేవా కార్యక్రమాలను కాంగ్రెస్ నాయకులు వక్రీకరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాజకీయ దురుద్దేశంతో.. కాంగ్రెస్ అసత్య ప్రచారం
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మార్గదర్శకాలు పాటిస్తూనే.. సరకుల పంపిణీలో భౌతిక దూరం పాటించినట్లు గుర్తు చేశారు. కరోనా బాధితులను ఆదుకునేందుకు రక్త దానం చేశారని.. లాక్ డౌన్ వల్ల పనులు లేక ఇబ్బందులు పడుతున్న వారికి ఆర్థిక సహాయం చేసినట్లు వెల్లడించారు. దురుద్దేశంతో కాంగ్రెస్ నేతలు అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
ఇదీ చూడండి:సీఎం సహాయనిధికి భారీగా విరాళాలు