తెలంగాణ

telangana

ETV Bharat / state

పటాన్​చెరులో 30 కిలోల గంజాయి స్వాధీనం - Polices Seized 30 Kgs Ganja at Patancheru latest news

సంగారెడ్డి జిల్లా పటాన్​చెరులో ఆటోలో గంజాయి తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను ఆబ్కారీ అధికారులు పట్టుకున్నారు. నిందితుల నుంచి 30 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు.

Polices  Seized  30 Kgs Ganja at Patancheru in Sangareddy district
పటాన్​చెరులో 30 కిలోల గంజాయి స్వాధీనం

By

Published : Jun 21, 2020, 2:23 AM IST

సంగారెడ్డి జిల్లా పటాన్​చెరు మండలం రుద్రారం శివారులో ఆబ్కారీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. అదే సమయంలో సంగారెడ్డి నుంచి పటాన్​చెరు వైపు వస్తున్న ఆటోలో తనిఖీలు నిర్వహించగా అందులో 30 కిలోల గంజాయి పట్టుబడింది. గంజాయి విలువ రూ. 2.5 లక్షలు ఉంటుందని తెలిపారు‌‌.

విట్టునాయక్ తండాకు చెందిన పాలియా టక్రూ, సుభాష్​ను అదుపులోకి తీసుకున్నారు. ఆటోను సీజ్ చేసి వారిని రిమాండ్​కు తరలించారు. వారికి సరఫరా చేసే ప్రధాన నిందితుడు బానోతు శ్రీను పరారీలో ఉన్నట్లు తెలిపారు. నిందితుడిని త్వరలోనే అరెస్టు చేస్తామని వెల్లడించారు.

ABOUT THE AUTHOR

...view details