లాక్ డౌన్ నేపథ్యంలో సంగారెడ్డిలో అకారణంగా బయటకు వచ్చిన వారి వాహనాలను పోలీసులు భారీ సంఖ్యలో సీజ్ చేశారు. పట్టణంలో ఏర్పాటు చేసిన చెక్ పోస్టుల వద్ద పోలీసు అధికారులు పటిష్ట బందోబస్తుతో విధులు నిర్వహిస్తున్నారు. అత్యవసరం సమయాల్లో తప్ప బయటకు రావొద్దని మరోసారి హెచ్చరించారు. ప్రజలంతా తమకు సహకరిస్తూ స్వీయ నియంత్రణ పాటించాలని కోరారు. కరోనా మహమ్మరిని తరిమి కొట్టేందుకు కలిసికట్టుగా కృషి చేద్దామని అధికారులు స్పష్టం చేశారు. వాహనాలపై ఇదివరకే ఉన్న చలాన్లు కట్టకుండా సరైన పత్రాలు లేని వాహనాలను పట్టణ పోలీస్ స్టేషన్కు తరలించారు.
అకారణంగా తిరిగారు...అడ్డంగా బుక్కయ్యారు.. - అకారణంగా తిరిగారు... వాహనాలు సీజ్ చేయించుకున్నారు.
సంగారెడ్డి జిల్లా కేంద్రంలో సరైన కారణం లేకుండా బయట తిరుగుతున్న వాహనదారులకు పోలీసులు బ్రేకులు వేశారు. అనంతరం వారి వాహనాలను స్వాధీనం చేసుకుని ఠాణాకు తరలించారు.
'అకారణంగా బయటకు వచ్చారా... మీ వాహనం సీజ్ అవుతుంది'
TAGGED:
లాక్ డౌన్