జనతా కర్ఫ్యూ సందర్భంగా రాష్ట్ర సరిహద్దు ప్రాంతాలను మూసివేశారు. వివిధ దేశాల నుంచి స్వస్థలాలకు వస్తున్న పలువురిని చెక్‌పోస్ట్‌ల వద్ద అడ్డుకున్నారు. ఏపీ, తెలంగాణ ప్రాంతాలకు చెందిన 35 మంది ఖతర్ నుంచి వస్తుండగా తెలంగాణ- కర్ణాటక సరిహద్దులో పోలీసులు అడ్డుకున్నారు. ముంబై విమానాశ్రయంలో పూర్తిస్థాయి వైద్య పరీక్షలు చేయించుకుని... తమకు ఎలాంటి వైరస్ సోకలేదని వైద్యులు నిర్ధారించిన ధ్రువపత్రాలు ఇచ్చినా వారిని రాష్ట్రంలోకి అనుమతించలేదని ప్రయాణికులు వాపోతున్నారు.
ఖతర్ నుంచి వస్తున్న 35 మందిని అడ్డుకున్న పోలీసులు
జనతా కర్ఫ్యూ నేపథ్యంలో ఖతర్ నుంచి వస్తున్న 35 మంది ప్రయాణికులను తెలంగాణ- కర్ణాటక సరిహద్దులో పోలీసులు అడ్డుకున్నారు. ఏపీలోని విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు చెందిన వీరంతా ఖతర్ దేశంలో పవర్ ప్రాజెక్టులో పనిచేసి స్వస్థలాలకు వస్తుండగా సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ వద్ద పోలీసులు వీరిని అడ్డుకున్నారు.
ఖతర్ నుంచి వస్తున్న 35 మందిని అడ్డుకున్న పోలీసులు
రాష్ట్రంలో కర్ఫ్యూ నేపథ్యంలో సోమవారం ఉదయం 6 గంటల వరకూ సరిహద్దు లోనే ఉండాలని పోలీసులు సూచించారు. రాష్ట్ర సరిహద్దుల్లో ఏర్పాటుచేసిన కరుణ వైద్య శిబిరాల వద్ద వారికి పరీక్షలు నిర్వహించారు. కనీస వసతి లేక ఇబ్బంది పడుతున్నామని.. తమను సొంతూరికి పంపించాలని ప్రయాణికులు కోరుతున్నారు.
ఇవీ చూడండి:'రాష్ట్రంలో సకలం స్వీయ నిర్బంధం'
TAGGED:
janatha curfew in telangana