సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం మల్లికార్జున నగర్లో పండుగకు ఊళ్లకు వెళ్లే వారికి పోలీసులు అవగాహన కల్పించారు. ఊరికి వెళ్లిన సమయంలో విలువైన వస్తువులు, నగదు ఇంట్లో ఉంచవద్దని తెలియజేశారు. ఇంటి తాళం వేస్తున్నప్పుడు పక్కన ఎవరికైనా చెప్పి వెళ్లాలని సూచించారు.
మీ భద్రత మీ చేతుల్లోనే ఉంది: పోలీసులు - మీ భద్రత మీ చేతుల్లోనే ఉంది: పోలీసులు
సంక్రాంతి పండుగకు ఊరు వెళ్తున్నారా అయితే మీ భద్రతను దృష్టిలో పెట్టుకుని జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు రామచంద్రపురం పోలీసులు.
మీ భద్రత మీ చేతుల్లోనే ఉంది: పోలీసులు
ఏదైనా అనుమానం ఉంటే డయల్ 100 నంబర్‌కు వెంటనే తెలియజేయాలని వారు తెలిపారు. దొంగతనాలు ఎక్కువగా జరుగుతున్నాయనే నేపథ్యంలో ఈ జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని వారు చెప్పారు. పోలీసులకు ప్రజలు సహకరించాలని కోరారు.
ఇవీ చూడండి: నిధిగా భావించారు... విధిగా నీరందించారు...