16మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు - 16మందిని అనుమానితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు
సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం నేతాజీ నగర్లో పోలీసులు ఇంటింటా విస్తృత తనిఖీలు నిర్వహించారు. నేరస్థులతో సంబంధాలున్నాయన్న కారణంతో 16 మంది అనుమానితులను అదుపులోకి తీసకున్నట్లు అదనపు డీసీపీ వెంకటేశ్వర్లు వెల్లడించారు.

సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం, నేతాజీ నగర్లో పోలీసులు శనివారం రాత్రి నిర్బంధ తనిఖీలు నిర్వహించారు. 385 ఇళ్లను తనిఖీలు చేయగా 55 ఇళ్లకు తాళాలు వేసి ఉన్నాయని అదనపు డీసీపీ వెంకటేశ్వర్లు తెలిపారు. 1331 మంది వ్యక్తిగత వివరాలను సేకరించామని వెల్లడించారు. నేరస్థులతో సంబంధాలున్నాయన్న కారణంతో 16 మంది అనుమానితులను అదుపులోకి తీసకున్నట్లు అదనపు డీసీపీ వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ తనిఖీల్లో 191 మంది పోలీస్ సిబ్బంది పాల్గొన్నారని ఆయన వెల్లడించారు.
ఇదీ చూడండి: భాజపా కార్యాలయంలో పదాధికారులతో జేపీ నడ్డా సమావేశం