సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో లాక్‌డౌన్ ఆంక్షలను పోలీసులు కట్టుదిట్టంగా అమలు చేస్తున్నారు. ఉదయం 10 గంటల వరకు వ్యాపారాలకు అనుమతించిన పోలీసులు.. ఆ తర్వాత రాకపోకలను నిలిపివేశారు. డీఎస్పీ శంకర్ రాజు.. పట్టణంలో లాక్‌డౌన్ అమలవుతోన్న తీరును పరిశీలించారు.
కట్టుదిట్టంగా అమలవుతోన్న లాక్‌డౌన్ - sangareddy lockdown
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో.. ఉదయం 10 గంటల నుంచి లాక్‌డౌన్ కొనసాగుతోంది. ఉదయాన్నే ప్రజలు అధిక సంఖ్యలో బయటకు వచ్చి నిత్యావసరాలను కొనుగోలు చేసి తిరిగి వెళ్లిపోయారు. డీఎస్పీ శంకర్ రాజు పట్టణంలో లాక్‌డౌన్ పరిస్థితిని పరిశీలించారు.
sangareddy locvkdown
తొలిరోజు ప్రధాన రహదారి సహా పట్టణ వీధులన్నీ నిర్మానుష్యంగా దర్శనమిచ్చాయి. వైద్యశాలలు, మందుల దుకాణాలు తెరిసే ఉండగా.. అత్యవసరం ఉన్నవారు మాత్రమే బయటకు వస్తున్నారు.