తెలంగాణ

telangana

ETV Bharat / state

మోదీ మెచ్చిన 'చిత్రం' - పప్పుధాన్యాలతో 'చిత్రం'

ఇంతవరకు కుంచెతో ఎన్నో కళాకృతులు సృష్టించాడు. కాని తన అభిమాన నేతకు భిన్నంగా ఏదైనా బహుకరించాలనుకున్నాడు. ప్రధాని చేపట్టిన అన్నదాతల సంక్షేమానికి కిసాన్​ సమ్మాన్​ నిధి పథకాన్ని తలంపు తెచ్చుకున్నాడు. తన కళాఖండానికి ముడిసరుకుగా రైతు పండించిన చిరుధాన్యాలనే ఎంచుకున్నాడు.

మోదీ మెచ్చిన 'చిత్రం'

By

Published : Feb 25, 2019, 12:41 PM IST

Updated : Feb 25, 2019, 5:25 PM IST

పప్పుధాన్యాలతో మోదీ చిత్రం
కాదేదీ కవితకు అనర్హం అన్నట్టు.. కాదేదీ కళాకృతికి అనర్హం అంటున్నాడు సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలం తడ్కల్​కు చెందిన ముప్పిడి విఠల్. తన అభిమాన నేత నరేంద్ర మోదీ ఇటీవల ప్రవేశపెట్టిన కిసాన్ సమ్మాన్ నిధి ఆయనను విశేషంగా ఆకట్టుకుంది. రైతన్నలకు ఉపయోగపడే ఈ పథకం తీసుకొచ్చినందుకు ఏదైనా ప్రత్యేకంగా తయారు చేయాలనుకున్నాడు.

పప్పుధాన్యాలతో 'చిత్రం'

రైతులు పండించే పప్పు ధాన్యాలనే ఎంచుకున్నాడు విఠల్. వరి, పెసర్లు, మినుములు, కందులతో మోదీ చిత్రాన్ని తయారుచేశాడు. తానే స్వయంగా తన అభిమాన నేతకు ఇవ్వడానికి దిల్లీ వెళ్లాడు. అక్కడ మోది అందుబాటులో లేరు. కిసాన్ సమ్మాన్ నిధి పథకం ప్రారంభించడానికి గోరఖ్​పూర్ వెళ్లారు.అలా ప్రధాని వద్దకు చేరింది.. ప్రధానికి ఇచ్చేందుకు గోరఖ్​పూర్ వెళ్లాలనుకున్నా... భద్రతా కారణాలరీత్యా అనుమతి రాలేదు. చివరకు ఆ చిత్రపటాన్ని కేంద్ర మంత్రి రాధా మోహన్​కు ఇవ్వగా.. ఆయన​ ప్రధానికి అందించారు. జీవం ఉట్టిపడేలా ఉన్న చిత్రాన్ని చూసి మోదీ ముగ్దుడయ్యారు. ఇంత మంచి బహుమతి ప్రదానం చేసిన అభిమానికి కృతజ్ఞతలు తెలిపారు.

ఇవీ చదవండి:ఇకెబనా అదిరే!

Last Updated : Feb 25, 2019, 5:25 PM IST

ABOUT THE AUTHOR

...view details