తెలంగాణ

telangana

ETV Bharat / state

farmer: దివ్యాంగుడి వ్యవసాయం.. నలుగురికి ఆదర్శం - sangareddy district

అతని ఆత్మ విశ్వాసం ముందు వైకల్యం చిన్నబోయింది. అతని పట్టుదలకు ప్రకృతి మూగబోయింది. కాళ్లు, చేతులు లేకపోయినా వ్యవసాయం చేస్తున్నాడు. తన భార్య బిడ్డలతో కలిసి వరినారు తీస్తూ నలుగురికి ఆదర్శంగా నిలుస్తున్నాడు సంగారెడ్డి జిల్లాకు చెందిన దివ్యాంగుడు వెంకటేశ్.

farmer
వ్యవసాయం చేస్తున్న దివ్యాంగుడు

By

Published : Aug 9, 2021, 5:27 AM IST

Updated : Aug 9, 2021, 8:05 AM IST

దివ్యాంగుడి వ్యవసాయం

ప్రస్తుత సమాజంలో చిన్న కష్టమొస్తేనే తట్టుకోలేరు. అలాంటిది కాళ్లు, చేతులు లేకపోతే వారి పరిస్థితి ఎలా ఉంటుందో ఓసారి ఊహించుకోండి. వారి ఏ పని చేసుకోవాలన్న ఇతరుల మీద ఆధార పడాల్సిందే. కానీ అతను మాత్రం వ్యవసాయం చేస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నాడు. అతని ఆత్మ విశ్వాసం ముందు వైకల్యం చిన్నబోయింది. అతను చేతికర్ర సాయంతో తన భార్య, పిల్లలతో కలిసి వ్యవసాయం చేస్తున్నాడు సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం మల్లేపల్లి గ్రామానికి చెందిన దివ్యాంగుడు వెంకటేశ్.

మల్లేపల్లి గ్రామానికి చెందిన దివ్యాంగుడు వెంకటేశ్(33) తనకున్న ఎకర పొలంలోనే వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. పెరిగిన ధరల కారణంగా పెట్టబడికి ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే తాను కూడా కష్టపడుతున్నాడు. అతని ఇద్దరు కూతుళ్లు, భార్యతో కలిసి నారు తీస్తూ శ్రమిస్తున్నాడు.

సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం మల్లేపల్లి గ్రామానికి చెందిన దివ్యాంగుడు వెంకటేశ్.
సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం మల్లేపల్లి గ్రామానికి చెందిన దివ్యాంగుడు వెంకటేశ్.

విద్యుదాఘాతంతో చేయి కోల్పోయాడు

2012లో పొలం పని చేస్తుండగా పెద్దఎత్తున గాలిదుమారం చెలరేగడంతో విద్యుత్ తీగలు మీదపడి ఓ చేయిని కోల్పోయాడు. చికిత్సకు దాదాపు రూ.2 లక్షలు ఖర్చు చేశారు. దీంతో అతని కుటుంబం పరిస్థితి మరింత దయనీయంగా మారింది. పనికి వెళ్తేనే పూట గడిచే పరిస్థితి ఏర్పడింది. వీరి దీనస్థితిని గతేడాది ఈటీవీ భారత్​లో ప్రచురితం కావడంతో హోప్​ ఫర్​ స్పందన అనే స్వచ్ఛంద సంస్థ అతనికి ఓ కిరాణ దుకాణం పెట్టించింది. అప్పటి నుంచి దుకాణం చూసుకుంటూ వ్యవసాయం చేస్తూ నలుగురికి ఆదర్శంగా నిలుస్తున్నాడు.

సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం మల్లేపల్లి గ్రామానికి చెందిన దివ్యాంగుడు వెంకటేశ్.

ఇదీ చూడండి:

HARISH RAO: 'యువత పారిశ్రామికవేత్తలుగా.. పిల్లలకు ప్రోటీన్ ఫుడ్'

Last Updated : Aug 9, 2021, 8:05 AM IST

ABOUT THE AUTHOR

...view details