సకాలంలో ఎరువులు పంపిణీ చేయడంలో.. జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ కృషి చేస్తోందని జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావు అన్నారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంలో డీసీఎంఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎరువుల దుకాణాన్ని ప్రారంభించారు. సొసైటీల్లో ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే ఎరువులు విక్రయిస్తున్నారని తెలిపారు. రైతులంతా ఈ సొసైటీల్లోనే ఎరువులు కొనుగోలు చేయాలని సూచించారు.
'సహకార సొసైటీల్లోనే ఎరువులు కొనుగోలు చేయాలి' - telangana news
జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీల్లోనే రైతులు ఎరువులు కొనుగోలు చేయాలని జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావు సూచించారు. పట్టణంలో డీసీఎంఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎరువుల దుకాణాన్ని ప్రారంభించారు.
సంగారెడ్డి జిల్లా వార్తలు, సంగారెడ్డిలో ఎరువుల పంపిణీ, జహీరాబాద్లో ఎరువుల పంపిణీ
వ్యవసాయ సహకార సంఘాలకు డీసీఎంఎస్ ఆధ్వర్యంలో అవసరమైనన్ని ఎరువులు సిద్ధంగా ఉన్నాయని ఛైర్మన్ శివకుమార్ తెలిపారు. ఎరువుల గోదాం ప్రారంభం సందర్భంగా.. పలువురు రైతులకు యూరియా, డీఏపీ బస్తాలను ఎమ్మెల్యే పంపిణీ చేశారు.
- ఇదీ చదవండి-వేలంలో లక్షలు పలికిన చేప- ఎందుకంత డిమాండ్?