సంగారెడ్డి జిల్లా నాగలిగిద్ద మండలంలోని ఇరాక్‌పల్లి శివారులో అనుమానాస్పద స్థితిలో ఓ వ్యక్తి మృతిచెందాడు. మృతుడు కరసగుత్తి పాండురంగ తండాకు చెందిన శంకర్‌గా గుర్తించారు. పథకం ప్రకారం హత్య చేశారని మృతుడి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తండాకు చెందిన శంకర్ ప్రేమ వివాహం చేసుకున్నాడు. తన భార్య వేరే వ్యక్తితో సంబంధం సాగిస్తోందని తెలుసుకుని కొన్ని రోజులుగా దూరం పెట్టాడు. ఇంతలో శంకర్ చనిపోయాడు. ఒంటరిగా బయటకు వెళ్లిన తన కుమారుడిని కోడలు, ఆమె ప్రియుడు కలిసి హత్య చేసి శవాన్ని చెట్టుకు వేలాడదీశారని శంకర్ తండ్రి ఫిర్యాదులో పేర్కొన్నాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
వ్యక్తి అనుమానస్పద స్థితిలో మృతి - person died in a suspicious in sangareddy
ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన ఘటన సంగారెడ్డి జిల్లా ఇరాక్‌పల్లి శివారులో చోటుచేసుకుంది. చెట్టుకు వేలాడుతూ వ్యక్తి చనిపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది.
వ్యక్తి అనుమానస్పద స్థితిలో మృతి