తెలంగాణ

telangana

ETV Bharat / state

మాస్కుల్లేకుండా తిరుగుతున్నారు... అధికారుల జరిమానా - VEHICLES WERE TAKEN BY POLICE

సంగారెడ్డి పట్టణంలో కొంత మంది వాహనాదారులు మాస్కుల్లేకుండా బయట తిరుగుతున్నారని రెవెన్యూ అధికారులు జరిమానా విధించారు. ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు వాహనాలను ఠాణాకు తరలించారు.

అతిక్రమణదారులకు అపరాధ రుసుం
అతిక్రమణదారులకు అపరాధ రుసుం

By

Published : Apr 17, 2020, 3:10 PM IST

Updated : Apr 17, 2020, 3:25 PM IST

సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని పలు ప్రాంతాల్లో మాస్కులు లేకుండా తిరుగుతున్న కొంత మంది వ్యక్తులకు రెవెన్యూ అధికారులు జరిమానా విధించారు. అకారణంగా బయటకు వచ్చిన వారికి ఫైన్ వేశారు. కొందరు చలానా కట్టగా మరికొందరు రెవిన్యూ అధికారులపై తిరగబడ్డారు. ప్రభుత్వ ఆదేశాలు ఉల్లంఘించడమే నేరమని ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు తెలిపారు. అధికారులను ఆక్షేపించిన వారిపై పోలీసులు మండిపడ్డారు. అనంతరం ఆయా వాహనాలను పోలీస్ స్టేషన్​కు తరలించారు.

Last Updated : Apr 17, 2020, 3:25 PM IST

ABOUT THE AUTHOR

...view details