కరోనా కట్టడికి విధించిన లాక్‌డౌన్ నిబంధనలు పాటించకుండా కొందరు రోడ్లపైకి వస్తున్నారు. సంగారెడ్డిలో పోలీసులు కట్టుదిట్టంగా చర్యలు చేపట్టినా... ఉదయం 10 గంటల తర్వాత... ఏదో ఒక సాకుతో ప్రజలు రోడ్లపై తిరుగుతున్నారు.
లాక్‌డౌన్ నిబంధనలు పట్టించుకోని జనం.. సమయం దాటినా రోడ్లపైనే! - తెలంగాణ వార్తలు
కొవిడ్ నియంత్రణలో భాగంగా విధించిన లాక్‌డౌన్‌ను కొందరు పట్టించుకోవడం లేదు. పోలీసులు కట్టుదిట్ట చర్యలు చేపట్టినా రోడ్లపై తిరుగుతున్నారు. అనవసరంగా బయటతిరుగుతున్న వారికి పోలీసులు జరిమానాలు విధిస్తున్నారు. అవసరం లేకున్నా రోడ్ల మీదకు రావొద్దని హెచ్చరిస్తున్నారు.
![లాక్‌డౌన్ నిబంధనలు పట్టించుకోని జనం.. సమయం దాటినా రోడ్లపైనే! lock down in sangareddy, sangareddy lock down](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11788583-thumbnail-3x2-police---copy.jpg)
సంగారెడ్డి జిల్లాలో లాక్‌డౌన్, లాక్‌డౌన్‌ను పట్టించుకోని జనం
ఎక్కడికక్కడ చెక్‌పోస్టులు ఏర్పాటు చేసిన పోలీసులు అనవసరంగా బయటతిరుగుతున్న వారికి జరిమానాలు విధిస్తున్నారు. వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ప్రజలు అనవసరంగా బయటకు రావొద్దని హెచ్చరిస్తున్నారు.
ఇదీ చదవండి:కొవిడ్ నియంత్రణలో దేశంలోనే తెలంగాణ నంబర్ వన్