తెలంగాణ

telangana

ETV Bharat / state

PROTEST: వాయు కాలుష్యంపై ఆందోళన... యాజమాన్యంతో వాగ్వాదం - సంగారెడ్డి జిల్లా వార్తలు

పరిశ్రమ నుంచి వెలువడుతున్న వాయు కాలుష్యంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం బొంతపల్లిలోని సైమేడ్ పరిశ్రమ ముందు నిరసనకు దిగారు.

People dharna at symed labs company
వాయు కాలుష్యంపై స్థానికుల ఆందోళన

By

Published : Jun 3, 2021, 6:47 PM IST

సైమేడ్ పరిశ్రమ నుంచి వెలువడుతున్న విష వాయువులతో తమకు ప్రాణహాని ఉందని స్థానికులు ఆందోళనకు దిగారు. వాయు కాలుష్యంతో ఊపిరాడక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని కంపెనీ ముందు నిరసన వ్యక్తం చేశారు. సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం బొంతపల్లిలోని పరిశ్రమ యాజమాన్యానికి, స్థానికులకు వాగ్వాదం జరిగింది.

పరిశ్రమ నుంచి వదులుతున్న విష వాయువుల వల్ల అనారోగ్యానికి గురవుతున్నామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో పరిశ్రమకు చెందిన ప్రతినిధులతో గొడవపడ్డారు. వాయు కాలుష్యంతో గత రాత్రి నుంచి తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కాలుష్యం వల్ల ప్రాణహాని ఉన్నా పీసీబీ అధికారులు పట్టించుకోవడం లేదని వాపోయారు. యాజమాన్యం ఇప్పటికైనా వాయు కాలుష్యం లేకుండా నిర్వహించుకోవాలని సూచించారు.

ఇదీ చూడండి:కేరళకు నైరుతి రుతుపవనాలు- జోరుగా వర్షాలు

ABOUT THE AUTHOR

...view details