సంగారెడ్డి జిల్లాలో కరోనా విజృంభిస్తున్న తరుణంలో అధికారుల నిర్లక్ష్యంతో సామాన్యులు అవస్థలు పడుతున్నారు. కంది మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో కొవిడ్ పరీక్షల కోసం జనాలు తరలివచ్చారు. రెండు రోజులుగా వస్తున్నా పరీక్షలు నిర్వహించలేదని కరోనా అనుమానితులు వాపోయారు.
'ప్రభుత్వ ఆస్పత్రిలో అధికారుల నిర్లక్ష్యం.. సామాన్యుల అవస్థలు' - తెలంగాణ వార్తలు
కరోనా రెండో దశ ప్రభావంతో పరీక్షల కోసం జనాలు తరలివస్తున్నారు. గంటల తరబడి పరీక్షా కేంద్రాల్లో నిరీక్షిస్తున్నారు. అయినా పరీక్షలు చేయడం లేదని కంది ప్రభుత్వాస్పత్రికి వచ్చిన అనుమానితులు వాపోయారు. అధికారులు నిర్లక్ష్యంంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.
కంది ప్రభుత్వాస్పత్రిలో పరీక్షలు, అధికారులపై ఆరోపణలు
ఉదయం నుంచి ఎదురు చూసిన కొంతమందికే పరీక్షలు చేస్తున్నారని ఆరోపించారు. అధికారులకు పరిచయం ఉన్నవారికే టీకాలు పక్కన పెట్టి మరీ ఇస్తున్నారని ఆరోపించారు. ఈ విపత్కర సమయంలో పేదలకు అధికారులు అండగా ఉండాలని కోరారు.
ఇదీ చదవండి:ప్రజలు కరోనాతో మరణిస్తుంటే.. మీకు ఇది అవసరమా?: హైకోర్టు