లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించి వ్యాపారాలు నిర్వహిస్తోన్న పలువురు దుకాణదారులకు సంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ జరిమానాలు విధించారు. ఈ మేరకు జహీరాబాద్ పట్టణంలో ఆకస్మికంగా పర్యటించిన రాజర్షి షా.. వ్యాపార వాణిజ్య సముదాయాలు, దుకాణాలను తనిఖీ చేశారు. మాస్క్లు ధరించకుండా వ్యాపారం నిర్వహిస్తోన్న పలువురు దుకాణదారులను గుర్తించి.. మున్సిపల్ అధికారులతో జరిమానాలు వేయించారు. రెండు, మూడు అంతస్తుల వస్త్ర దుకాణమైనప్పటికీ.. ఐదుగురు సిబ్బందితో పాటు పది మంది మాత్రమే కొనుగోలుదారులను అనుమతించాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు హామీ పత్రం రాసి ఆర్డీవో, మున్సిపల్ కమిషనర్, పోలీసు అధికారులకు అందజేయాలని వ్యాపారులకు సూచించారు.
లాక్డౌన్ ఉల్లంఘనులకు జరిమానాలు - సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో లాక్డౌన్ అమలు తీరును పరిశీలించిన అదనపు కలెక్టర్
లాక్డౌన్ ఆంక్షలు ఉల్లంఘించిన పలువురు వ్యాపారులకు సంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ రాజర్షి షా జరిమానాలు విధించారు. ఈ మేరకు జిల్లాలోని జహీరాబాద్ పట్టణంలో లాక్డౌన్ అమలు తీరును తెలుసుకునేందుకు ఆయన ఆకస్మిక పర్యటన చేపట్టారు. ఈ సందర్భంగా వ్యాపార వాణిజ్య సముదాయాలతో పాటు దుకాణాలను తనిఖీ చేశారు.
లాక్డౌన్ ఉల్లంఘనులకు జరిమానాలు
అంతకుముందు మొగుడంపల్లి మండలం మాడిగి శివారులోని తెలంగాణ-కర్ణాటక సరిహద్దులో గల అంతర్రాష్ట్ర చెక్పోస్టును తనిఖీ చేశారు. పొరుగు రాష్ట్రాలకు వెళ్లేవారికి పాసులు జారీ సహా, పొరుగు రాష్ట్రాల నుంచి జిల్లాలోకి వస్తున్న వారికి వైద్య పరీక్షల నిర్వహణ తీరును పరిశీలించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వెంట ఆర్డీవో రమేష్ బాబు, మున్సిపల్ కమిషనర్ విక్రమసింహ రెడ్డి, ఎంవీఐ అశ్వంత్ కుమార్ తదితరులు ఉన్నారు.
ఇవీ చూడండి : ప్రాణం పోయినా పర్లేదు.. పంపించండి