కరోనా నేపథ్యంలో గణేశ్ ఉత్సవాల నిర్వహణపై సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో పోలీసులు స్థానికులతో సమావేశం నిర్వహించారు. ఏటా 11రోజుల పాటు జరుపుకునే వేడుకలను ఈసారి ఐదురోజులు మాత్రమే చేసుకోవాలని సూచించారు.
'కొవిడ్ నిబంధనలు పాటిస్తూ గణేశ్ ఉత్సవాలు జరుపుకోవాలి' - సంగారెడ్డి జిల్లా తాజా వార్తలు
కొవిడ్ నిబంధనలు పాటిస్తూ గణేశ్ ఉత్సవాలు జరుపుకోవాలని జహీరాబాద్ పోలీసులు సూచించారు. గణేశ్ ఉత్సవాల నిర్వహణ పై శాంతి కమిటీ సమావేశం జరిపారు.

'కొవిడ్ నిబంధనలు పాటిస్తూ గణేశ్ ఉత్సవాలు జరుపుకోవాలి'
కాలనీకి ఒక విగ్రహం మాత్రమే ఏర్పాటు చేసుకోవాలని.. మండపాల వద్ద ప్రసాద వితరణ చేపట్టకూడదని తెలిపారు. నిమజ్జనం కార్యక్రమాన్ని హడావుడి లేకుండా జరుపుకోవాలన్నారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఇదీ చూడండి : కేంద్ర హోంమంత్రి పతకానికి సీబీఐ హైదరాబాద్ ఎస్పీ ఎంపిక