సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్‌లో కురిసిన భారీ వర్షానికి మండలంలోని తుర్కపల్లి శివారులోని పటేల్ చెరువు అలుగు తెగి నీరు వృథాగా పోతోంది. తుర్కపల్లి గ్రామంలో గొలుసుకట్టు చెరువులు 5 ఉన్నాయి. వాటిలో మొదటిదైన పటేల్ చెరువు అలుగు నుంచి పెద్దమ్మ కుంటలోకి వెళ్లే కాలువ తెగిపోవడంతో నీరు వృథాగా బయటకు పోతోంది.
పటేల్ చెరువు నుంచి వృథాగా పోతున్న నీరు - తెలంగాణ వార్తలు
నారాయణఖేడ్‌లో కురిసిన భారీ వర్షానికి పటేల్ చెరువు అలుగు తెగి నీరు వృథాగా పోతోంది. తుర్కపల్లి గ్రామంలో 5 గొలుసుకట్టు చెరువులు ఉన్నాయి. నీరు వృథాగా పోతోందని.. అధికారులు చర్యలు చేపట్టాలని రైతులు కోరుతున్నారు.
పటేల్ చెరువు, గొలుసుకట్టు చెరువులు
పెద్దమ్మ కుంట నిండితే అక్కడి నుంచి పెరమండ్ల కుంటకు వెళ్తాయి. అక్కడి నుంచి తురక చెరువులోకి పోతాయి. కానీ ప్రస్తుతం నీరు వృథాగా పోతోంది. అధికారులు స్పందించి మరమ్మతులు చేయించాలని రైతులు కోరుతున్నారు.
ఇదీ చదవండి:ఫామ్‌హౌస్‌లో జన్మదిన వేడుకలు.. అదుపులో 70 మంది యవత