పంటను అమ్ముకునే సమయంలో రైతులు దళారీల బారిన పడకుండా చూడాలని ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. సంగారెడ్డి జిల్లాలోని రామచంద్రాపురం మండలంలోని వెలిమల, గుమ్మడిదల గ్రామాల్లో మక్కల కొనుగోలు కేంద్రాలను ఆయన ప్రారంభించారు. పటాన్‌చెరు నియోజకవర్గంలో 1500 లారీల మక్కలు కొనుగోలు చేసేలా ఏర్పాట్లు చేశామన్నారు.
రైతులు దళారీల బారిన పడొద్దు: ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి - సంగారెడ్డి జిల్లా సమాచారం
రైతులు ఆరుగాలం శ్రమించి పండించిన పంటను దళారీలకు అమ్ముకోవద్దని పటాన్‌చెరు ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి సూచించారు. సంగారెడ్డి జిల్లాలోని పలు గ్రామాల్లో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ఆయన ప్రారంభించారు.
![రైతులు దళారీల బారిన పడొద్దు: ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి Patancheruvu MLA started corn buying centres in sangareddy dist](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9489501-1091-9489501-1604929070578.jpg)
రైతులు దళారీల బారిన పడొద్దు : ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి
ప్రభుత్వం సూచించిన ధరకే పంటను విక్రయించి లాభం పొందాలని రైతులకు ఎమ్మెల్యే సూచించారు. రైతులు ఏ పంట వేయాలో వ్యవసాయ అధికారులకు సూచనలు చేశామన్నారు. లాభసాటిగా ఉండే పత్తి, కంది, సన్నరకం వరి పంటలు వేయాలని తెలిపారు. మక్కలను మార్కెట్ ధర కంటే 600 రూపాయల అధికంగా చెల్లిస్తున్నామని మహిపాల్‌రెడ్డి వెల్లడించారు.