సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం రుద్రారం గ్రామ పరిధిలో ఉన్న గణపతి దేవాలయంలో బ్రహ్మోత్సవాల ముగింపు సందర్భంగా ఉదయం స్వామి వారికి ఉదయాన్నే అభిషేకం అనంతరం గణపతి హోమం, పల్లకీ సేవ నిర్వహించారు.
గణేష్ ఉత్సవాల ముగింపు... ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు - సంగారెడ్డి జిల్లా వార్తలు
సంగారెడ్డి జిల్లా రుద్రారం గణపతి దేవాలయంలో బ్రహ్మోత్సవాలు ముగింపు కార్యక్రమంలో ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి పాల్గొని పూజలు నిర్వహించారు. అలాగే మూడు లడ్డూలను 10.65 లక్షలకు భక్తులు వేలంలో దక్కించుకున్నారు.
గణేష్ బ్రహ్మోత్సవాల ముగింపు... ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు
సాయంత్రం నిర్వహించిన లడ్డూల వేలంపాటలో తొలి లడ్డూను ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి కుమారుడు విష్ణువర్ధన్ రెడ్డి 5.05 లక్షలకు, రెండో లడ్డును గాయత్రి పాండు 5 లక్షలకు, మూడోదాన్ని శ్రీశైలం యాదవ్ 60 వేలకు దక్కించుకున్నారు. కళాకారులుచే నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. బ్రహ్మోత్సవాల ముగింపు కార్యక్రమంలో ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు.
ఇవీ చూడండి: కేసీఆర్‌కు ప్రజా సంక్షేమం కంటే ఆర్థిక లావాదేవీలే ముఖ్యం : భట్టి