సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం బీరంగూడ-కిష్టారెడ్డిపేట రహదారికి 49 కోట్ల రూపాయలతో నిర్వహించే విస్తరణ పనులను పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ప్రారంభించారు. గత ఎన్నికల సభలో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు బీరంగూడ-కిష్టారెడ్డిపేట రహదారి విస్తరణ పనులను చేపడుతున్నట్లు ఆయన చెప్పారు. సాంకేతిక కారణాలు, కొవిడ్ మూలంగా రహదారి విస్తరణ పనులు కొద్దిగా ఆలస్యంగా ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. త్వరితగతిన పనులు ప్రారంభించేలా చర్యలు చేపట్టిన ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్సీ భూపాల్‌రెడ్డిలకు ఎమ్మెల్యే ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. వచ్చే నాలుగు నెలల్లో రహదారి పనులు పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామన్నారు.
రహదారి విస్తరణ పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి - సంగారెడ్డి జిల్లా వార్తలు
సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం బీరంగూడ -కిష్టారెడ్డిపేట రోడ్డు విస్తరణ చేసేందుకు హామీ ఇచ్చామని, ప్రస్తుతం పనులను ప్రారంభిస్తున్నామని ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి అన్నారు. 49కోట్ల రూపాయలతో నిర్వహించే విస్తరణ పనులను ఎమ్మెల్యే ప్రారంభించారు. వచ్చే నాలుగు నెలల్లో రహదారి పనులు పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామన్నారు.
రహదారికి ఇరువైపులా డ్రైనేజీ, మధ్యలో డివైడర్, సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేసి సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతామన్నారు. రోడ్డు నిర్మాణం పూర్తయితే అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని వందలాది కాలనీలు, అమీర్పూర్ మండల పరిధిలోని వివిధ గ్రామాలతో పాటు జిన్నారం, గుమ్మడిదల ప్రజలకు కూడా ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు. రహదారి నిర్మాణం జరిగే సమయంలో సమీప కాలనీల ప్రజలు ప్రత్యామ్నాయ మార్గాల్లో ప్రయాణించాలని ఆయన కోరారు. తమది మాటల ప్రభుత్వం కాదని.. చేతల ప్రభుత్వం అని ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ ఈ రోడ్డు విస్తరణ పనులే అన్నారు.
ఇవీ చూడండి: 'పరిసరాల పరిశుభ్రతలో అందరూ భాగస్వాములు కావాలి'