సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు మార్కెట్ యార్డు కార్యాలయంలో ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి కార్యవర్గంతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. మలక్‌పేట నుంచి వచ్చే ఉల్లి వ్యాపారులకు అనువుగా నిర్మించాల్సిన అదనపు షెడ్లు, సీసీ రహదారుల నిర్మాణం, ఇతర సౌకర్యాల అభివృద్ధికోసం సమావేశంలో తీర్మానాలు చేశారు. ఉల్లి మార్కెట్‌తోపాటు జియాగూడలోని గొర్రెలు మార్కెట్, అలాగే అల్లం, వెల్లుల్లి, మిర్చి ఆలుగడ్డ, చింతపండు మార్కెట్లు ఇక్కడ వచ్చేలా కృషి చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.
'మార్కెట్ యార్డును రూ.62 కోట్లతో ఆధునీకరిస్తాం' - Patancheru market yard We will modernise with the 62 crores
సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మార్కెట్ యార్డు అభివృద్ధి పనులపై ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి కార్యవర్గంతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. మంత్రులు హరీశ్ రావు, నిరంజన్ రెడ్డిల సహాయ సహకారాలతో అభివృద్ధి చేస్తానని ఆయన తెలిపారు.

'మార్కెట్ యార్డును 62కోట్లతో ఆధునీకరిస్తాం'
62 కోట్ల రూపాయల నాబార్డు నిధులతో మార్కెట్ యార్డు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. పక్కనే ఉన్న రైల్వే భూమిని కూడా మార్కెటింగ్ అవసరాలకు కేటాయించాలని ఎంపీ ప్రభాకర్‌రెడ్డి ద్వారా రైల్వే మంత్రిని కోరామన్నారు. ఇప్పటికే నియోజకవర్గానికి 2,500 మెట్రిక్ టన్నుల సామర్థ్యంగల శీతల గిడ్డంగులు మంజూరైనట్లు పేర్కొన్నారు.