సంగారెడ్డి జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిలో 8 రోజుల పాప అదృశ్యం సంచలనం సృష్టించింది. కలబ్గూర్ గ్రామానికి చెందిన మాధవికి గత నెల 30న సాధారణ కాన్పు జరిగింది. పాపకి పచ్చ కామెర్లు కావడం వల్ల ఈ నెల 3న జిల్లా కేంద్ర ఆసుపత్రిలో చేర్చారు. తల్లి పాల కోసం పాపను ఎస్ఎన్సీయూ నుంచి తీసుకొచ్చిన ఆయా వనిత..మాధవికి బదులు మరో మహిళకి చిన్నారిని అప్పగించింది. తన పాప ఎక్కడ అని బంధువులు ప్రశ్నించగా.. మీకే అప్పగించానని ఆయా బదులివ్వడంతో.. కంగుతిన్నారు.
ఆగ్రహించిన కుటుంబ సభ్యులు ఆసుపత్రిపైకి రాళ్లతో దాడి చేశారు. పోలీసులు పరిస్థితిని అదుపుచేసి.. పాప ఆచూకీ కోసం సీసీ కెమెరాలను శోధించారు. ఆయా పాపను మరొక మహిళకు అప్పగించినట్లు స్పష్టంగా తేలింది. పెళ్లయిన పదేళ్లకు పాప పుట్టిందని బాధితురాలు మాధవి వాపోయింది. జిల్లా కేంద్ర ఆసుపత్రిలో ఇలాంటి ఘటన జరగడం బాధాకరమని.. సీసీ ఫుటేజీ ద్వారా ఆధారాలు సేకరిస్తున్నామని.. త్వరలోనే పాపను కనుక్కొంటామని జిల్లా వైద్యాధికారి తెలిపారు.
ఆస్పత్రిలో చిన్నారి మాయం..ఆయాదే హస్తం - sangareddy
పాపకు ఆరోగ్యం బాగాలేదని ఆసుపత్రికి తీసుకెళ్తే..చిన్నారినే మాయం చేశారు. సంగారెడ్డి జిల్లా కేంద్ర ఆసుపత్రిలో ఈ ఘటన చోటుచేసుకుంది. పెళ్లయిన పదేళ్లకు పుట్టిన పాపను కూడా దూరం చేశారని ఆ తల్లి శోకసంద్రంలో మునిగింది.
ఆస్పత్రిలో చిన్నారి మాయం
ఇవీ చూడండి: అత్తారింటికి వెళ్తుండగా నవ వధువు కిడ్నాప్