తెలంగాణ

telangana

ETV Bharat / state

'రాత్రీ పగలూ లేదు.. సెలవు రోజుల్లోనూ వదలట్లేదు' - పంచాయతీ కార్యదర్శుల ఆందోళన

సెలవు దినాల్లో విధులు వేస్తున్నారని... రాత్రి 10 గంటల వరకు సమావేశాలు నిర్వహిస్తున్నారని పంచాయతీ కార్యదర్శులు సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్​ ముందు ఆందోళనకు దిగారు. అధికారులు తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

panchayath-secretary-protest-at-sangareddy-collector-office
కలెక్టరేట్​ ముందు పంచాయతీ కార్యదర్శుల ఆందోళన

By

Published : Jul 22, 2020, 9:26 AM IST

సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్​ ఎదుట పంచాయతీ కార్యదర్శులు ఆందోళనకు దిగారు. ధర్నా చేసేందుకు వచ్చిన వారిని పోలీసులు అడ్డుకోవడంతో... రోడ్డుపైనే బైఠాయించి తమ నిరసన వ్యక్తం చేశారు.

ప్రభుత్వ సెలవు దినాలు, ఆదివారాల్లోనూ తమకు విధులు వేస్తున్నారని... రాత్రి పది గంటల వరకూ సమావేశాలు పెడుతున్నారని ఆరోపించారు.

జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వర్లు అక్కడికి చేరుకుని... వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఇలా ఒకే చోట గుమిగూడటం మంచిది కాదని పోలీసులు హెచ్చరించారు.

సమస్యలు పరిష్కరించే ప్రయత్నం చేస్తామన్న ఉన్నతాధికారి హామీతో కార్యదర్శులు తమ ఆందోళన విరమించారు.

ఇదీ చూడండి:లాక్​డౌన్ ఎఫెక్ట్: ఆలుమగల మధ్య కరోనా రగిల్చిన మంటలివి!

ABOUT THE AUTHOR

...view details