తెలంగాణ

telangana

ETV Bharat / state

నర్సరీలో కూలీలుగా మారిన పంచాయతీ కార్యదర్శులు - సంగారెడ్డి జిల్లా తాజా వార్తలు

సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం మగ్దూంపల్లి గ్రామంలోని నర్సరీలో 30 మంది పంచాయతీ కార్యదర్శులు వినూత్నంగా నిరసన చేపట్టారు. ఉపాధి హామీ పథకంలోని క్షేత్ర సహాయకులను తొలగించి తమతో మొక్కలు నాటే పనులు చేయిస్తున్నారని ఆరోపించారు. ఈ మేరకు నర్సరీలో పనులు చేస్తూ తమ నిరసన వ్యక్తం చేశారు.

panchayat secretaries protest in village nurseries
నర్సరీలో కూలీలుగా మారి పంచాయతీ కార్యదర్శుల నిరసన

By

Published : Dec 6, 2020, 1:26 PM IST

సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం మగ్దూంపల్లి గ్రామంలోని నర్సరీలో 30 మంది పంచాయతీ కార్యదర్శులు నర్సరీలో పనులు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఉపాధి హామీ పథకంలో క్షేత్ర సహాయకులను తొలగించడంతో ఆ పనులను చేయించే బాధ్యతను అధికారులు.. పంచాయతీ కార్యదర్శులకు అప్పగించారు. దీంతో నర్సరీలో మొక్కలు పెంచాల్సి ఉందని అధికారులు ఒత్తిడి తెస్తున్నారని కార్యదర్శులు వాపోతున్నారు.

ఉన్న వాళ్లని తీసేసి

గ్రామంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా ఏర్పాటు చేసిన నర్సరీల్లో మొక్కలు పెంచేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా ప్రతి ఏటా వేల సంఖ్యలో మొక్కలు పెంచుతోంది. ఉపాధి హామీ క్షేత్ర సహాయకులను తొలగించడంతో ఆ పనులు చేయించే బాధ్యతని అధికారులు.. పంచాయతీ కార్యదర్శులకు అప్పగించారు. రైతు కూలీలకు పత్తి తీసే సీజన్ కావడంతో వారంతా అదే పనులకు వెళ్తున్నారు. కూలీలు లభించకపోవడం ఓ సమస్య అయితే.. నర్సరీలో మొక్కలు పెంచాల్సిందేనని అధికారులు ఒత్తిడి పెంచుతున్నారని కార్యదర్శులు వాపోతున్నారు. దీంతో నర్సరీల్లో పనులు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి:భారత్​ బంద్​కు కేసీఆర్ సంపూర్ణ మద్దతు

ABOUT THE AUTHOR

...view details