తెలంగాణ

telangana

ETV Bharat / state

ప్రజల భాగస్వామ్యంతోనే పల్లెప్రగతి సాధ్యం: మాణిక్​రావు - latest news on Pallepragati is possible only with public participation

సంగారెడ్డి జిల్లా హుగ్గెల్లి​లో నిర్వహించిన రెండో విడత పల్లెప్రగతి కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే మాణిక్​రావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేను ఘనంగా సత్కరించారు.

Pallepragati is possible only with public participation: Manik Rao
ప్రజా భాగస్వామ్యంతోనే పల్లెప్రగతి సాధ్యం: మాణిక్​రావు

By

Published : Jan 2, 2020, 5:19 PM IST

ప్రజల భాగస్వామ్యంతోనే పల్లెప్రగతి సాధ్యమని జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్​రావు పేర్కొన్నారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం హుగ్గెల్లిలో నిర్వహించిన పల్లెప్రగతి కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా గ్రామంలో మొక్కలు నాటారు. అనంతరం స్థానిక ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేను ఘనంగా సత్కరించారు.

గ్రామస్థులు కలిసికట్టుగా ముందుకు సాగితేనే గ్రామాభివృద్ధి సాధ్యమవుతుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. గ్రామాభివృద్ధికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని హామీ ఇచ్చారు. స్థానిక ప్రజా ప్రతినిధులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని రెండో దశ పల్లెప్రగతిని విజయవంతం చేయాలని కోరారు.

ప్రజా భాగస్వామ్యంతోనే పల్లెప్రగతి సాధ్యం: మాణిక్​రావు

ఇవీ చూడండి: 'నేను సీఎం అవుతాననే చర్చే అవసరం లేదు"

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details