సంగారెడ్డి జిల్లా పటాన్చెరు ప్రాంతీయ ఆసుపత్రికి గత పది రోజుల క్రితం వెంటిలేటర్ చికిత్సకు ఉపయోపడే ఆక్సిజన్ సిలిండర్లు వచ్చినా నేటికీ వాటిని అమర్చకపోవడం సిగ్గుచేటని భాజపా జిల్లా కార్యద్శి బైండ్ల కుమార్ విమర్శించారు. ఆక్సిజన్ అందక ఎంతో మంది కరోనా రోగులు చనిపోతున్నారని.. రోజుకు పదుల సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నా.. వాటిని బిగించకుండా ఆసుపత్రిలో ఓ మూలనపెట్టడం ఏంటని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
'ఆక్సిజన్ సిలిండర్లను ఎందుకు అమర్చలేదు?' - పటాన్చెరు ఏరియా ఆసుపత్రిలోని ఆక్సిజన్ సిలిండ్లు అమర్చలేదు
కేంద్రం నుంచి వచ్చిన ఆక్సిజన్ సిలిండర్లను అమర్చకపోవడం సిగ్గుచేటని భాజపా జిల్లా కార్యదర్శి బైండ్ల కుమార్ విమర్శిచారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరులోని ప్రాంతీయ ఆసుపత్రిని కార్యకర్తలతో కలిసి సందర్శించారు.
!['ఆక్సిజన్ సిలిండర్లను ఎందుకు అమర్చలేదు?' Oxygen cylinders were not installed at Patancheru Area Hospital in Sangareddy](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8217190-57-8217190-1596016762025.jpg)
'ఆక్సిజన్ సిలిండర్లను ఎందుకు అమర్చలేదు?'
వెంటనే వాటిని అమర్చి రోగులకు అందుబాటులోకి తీసుకురావాలని కుమార్ డిమాండ్ చేశారు. మహమ్మారి వ్యాపిస్తోన్నప్పటి నుంచి భాజపా రాష్ట్ర అధ్యక్షుల బండి సంజయ్ పిలుపు మేరకు కార్యకర్తలు భయపడకుండా ప్రాణాలకు తెగించి విపత్కర సమయంలో ప్రజలను ఆదుకుంటున్నారని తెలిపారు.
ఇవీ చూడండి:గేటెడ్ కమ్యూనిటీల్లో కరోనా చికిత్స