సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ డివిజన్ పరిధిలోని కల్హేర్ మండలం మాసన్పల్లి వైన్స్‌ను లాక్‌డౌన్ కారణంగా అధికారులు సీలు వేశారు. ఈ తెల్లవారుజామున అందులో ఉన్న సరుకును ఎవరికీ తెలియకుండా తరలించేందుకు యాజమాని పథకం వేశాడు. తాళం తీయకుండా పక్కనున్న మరో దారిగుండా లోపలికి ప్రవేశించి మద్యాన్ని వాహనంలోకి ఎక్కిస్తుండగా స్థానికులు గమనించారు.
మద్యం షాపులకు ముందు తాళాలు.. వెనక నుంచి అక్రమ దందాలు - Owners of wines shop that illegally sell alcohol
బార్ల యజమానులు బరితెగిస్తున్నారు. ఓ వైపు కరోనా నేపథ్యంలో ప్రభుత్వం లాక్‌డౌన్ ప్రకటిస్తే..మరో వైపు దొంగ చాటున అక్రమంగా మద్యం విక్రయాలు సాగిస్తున్నారు. ఇక ఇదే అదునుగా భావించిన మద్యం యాజమానులు క్యాష్ చేసుకునే పనిలో పడ్డారు. జోరుగా అక్రమ మద్యం దందాకు తెరతీశారు.
మద్యం షాపులకు ముందు తాళాలు.. వెనక నుంచి అక్రమ దందాలు
వెంటనే అతనిని అడ్డగించి నారాయణఖేడ్ ఎక్సైజ్ పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొనే లోపే యాజమాని అక్కడి నుంచి పరారయ్యాడు. స్థానికుల ఫిర్యాదు మేరకు అతనిపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.