తెలంగాణ

telangana

ETV Bharat / state

8 ఏళ్లలో వైద్యకళాశాలల్లో 127శాతానికి సీట్లు పెరిగాయి: హరీశ్​రావు - Siddipet Latest News

Orientation Program of Siddipet Medical College: సిద్దిపేట వైద్యకళాశలలో జరిగిన పీజీ మొదటి సంవత్సరం విద్యార్థుల ఓరియంటేషన్ కార్యక్రమానికి మంత్రి హరీశ్​రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా కళాశాల ఆవరణలో ప్రభుత్వ కేంద్రీయ ఔషధ గిడ్డంగి, 50పడకల ప్రభుత్వాస్పత్రి భవన నిర్మాణానికి హరీశ్ శంకుస్థాపన చేశారు.

Orientation Program of Siddipet Medical College
సిద్దిపేట మెడికల్ కాలేజ్​ ఓరియెంటెషన్ కార్యక్రమం

By

Published : Dec 12, 2022, 10:16 PM IST

Orientation Program of Siddipet Medical College: వైద్యకళాశాలల్లో సీట్లతో పాటు కావాల్సిన సౌకర్యాలను ప్రభుత్వం కల్పిస్తోందని.... విద్యార్థులు చదువుపైనే దృష్టి సారించి, గమ్యాన్ని చేరుకోవాలని వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు సూచించారు. సిద్దిపేట వైద్యకళాశలలో జరిగిన పీజీ మొదటి సంవత్సరం విద్యార్థుల ఓరియంటేషన్ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు.

ఈ సందర్భంగా కళాశాల ఆవరణలో ప్రభుత్వ కేంద్రీయ ఔషధ గిడ్డంగి, 50పడకల ప్రభుత్వాస్పత్రి భవన నిర్మాణానికి హరీశ్ శంకుస్థాపన చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన 8ఏళ్లలో వైద్యకళాశాలల్లో 127శాతానికి సీట్లు పెరిగినట్లు హరీశ్ రావు తెలిపారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details