సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ ఆవరణలో సేంద్రీయ కూరగాయలు, పండ్ల మార్కెట్‌ను డీఆర్వో రాధికా రమణి ప్రారంభించారు. కరోనా విస్తరిస్తున్న తరుణంలో ప్రజల్లో రోగ నిరోధక శక్తిని పెంచేందుకు ఈ మార్కెట్‌ను ప్రారంభించినట్లు ఆమె తెలిపారు. ప్రతీ సోమవారం కలెక్టరేట్లో ఈ మార్కెట్ ఏర్పాటు చేయనున్నట్లు ఉద్యానవన శాఖ జిల్లా అధికారి సునీత చెప్పారు. 24 రకాల కూరగాయలను రూ. 500కి, 7 రకాల పండ్లను రూ.350కి అమ్ముతున్నారన్నారు. హోమ్ డెలివరీ సదుపాయం, మొబైల్ నుంచి అడ్వాన్ బుకింగ్ చేసుకునే అవకాశం ఉందన్నారు.
సంగారెడ్డిలో సేంద్రీయ కూరగాయల మార్కెట్ ప్రారంభం - Sangareddy Collectorate Organic Fruit Market
ప్రజల్లో రోగ నిరోధక శక్తిని పెంచేందుకు సంగారెడ్డి కలెక్టరేట్ ఆవరణలో సేంద్రీయ కూరగాయల మార్కెట్‌ను ప్రారంభించారు. ప్రతి సోమవారం ఈ మార్కెట్‌ను ఏర్పాటు చేయనున్నట్లు ఉద్యానవన జిల్లా అధికారి సునీత తెలిపారు.

సేంద్రీయ కూరగాయల మార్కెట్