తెలంగాణ

telangana

ETV Bharat / state

Lift Irrigation schemes: సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకాల ఉత్తర్వులు జారీ - తెలంగాణ వార్తలు

Lift Irrigation schemes
ఎత్తిపోతల పథకాలు

By

Published : Sep 23, 2021, 6:07 PM IST

Updated : Sep 23, 2021, 7:36 PM IST

18:03 September 23

Lift Irrigation schemes: సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకాల ఉత్తర్వులు జారీ

  సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకాలకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సంగారెడ్డి జిల్లాలో చేపట్టబోయే ఈ రెండు ఎత్తిపోతల పథకాలకు పరిపాలన అనుమతులు ఇచ్చింది. రూ. 2.19 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేలా రూ.2,653 కోట్లతో సంగమేశ్వర ఎత్తిపోతల పథకం చేపట్టనున్నారు. 1.65 లక్షల ఎకరాలకు నీరు ఇచ్చేలా రూ.1,774 కోట్లతో బసవేశ్వర ఎత్తిపోతల పథకం రూపొందించారు. 

  సంగమేశ్వర ఈ పథకం ద్వారా సంగారెడ్డి, ఆందోల్, జహీరాబాద్ నియోజకవర్గాలకు ప్రయోజనం కలుగనుంది. రెండు పంపు హౌసులు ఏర్పాటు చేసి దీనిని పూర్తి చేయనున్నారు. 

ఇదీ చదవండి:కరోనా మృతుల కుటుంబాలకు పరిహారం- సుప్రీంకోర్టు ప్రశంసలు

Last Updated : Sep 23, 2021, 7:36 PM IST

ABOUT THE AUTHOR

...view details