సంగారెడ్డి జిల్లాలోని ప్రభుత్వ, ప్రయ్వేట్ ఆస్పత్రుల్లో ఓపీ సేవలు నిలిచిపోయాయి. ఆయుర్వేద వైద్యులకు శస్త్ర చికిత్సలు చేసే అధికారాన్ని కల్పించడాన్ని ఖండిస్తూ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను వెనక్కి తీసుకోవాలంటూ ఇండియన్ మెడికల్ అసోషియేషన్ బంద్కు పిలుపునిచ్చింది.
కేంద్రం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఓపీ సేవలు బంద్ - సంగారెడ్డి జిల్లా వార్తలు
ఆయుర్వేద వైద్యులకు శస్త్ర చికిత్సలు చేసే అధికారాన్ని కల్పించడాన్ని ఖండిస్తూ ఇండియన్ మెడికల్ అసోషియేషన్ బంద్కు పిలుపునివ్వడంతో ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఓపీ సేవలు నిలిచిపోయాయి. సంగారెడ్డి జిల్లా ప్రభుత్వ, ప్రయ్వేట్ వైద్యులు విధులు బహిష్కరించారు. అత్యవసర సేవలు మినహా అన్నింటినీ నిలిపివేశారు.
![కేంద్రం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఓపీ సేవలు బంద్ OP services shut down in govt and private hospitals protest of the Centre's decision in sangareddy dist](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9843075-854-9843075-1607687458696.jpg)
కేంద్రం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఓపీ సేవలు బంద్
అత్యవసర, కరోనా చికిత్సలు మినహా అన్ని సేవలను ఉదయం ఆరు నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు నిలిపివేస్తున్నట్లు వైద్యులు స్పష్టం చేశారు. దేశమంతా నిరసన కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోకుంటే పెద్దఎత్తున ఉద్యమాలు చేస్తామని వైద్యులు హెచ్చరించారు.