గత నాలుగేళ్లుగా ఉల్లి సాగు చేస్తున్న రైతులు నష్టాలు మూట గట్టుకుంటున్నారు. ఓ ఏడాది వాతావరణం దెబ్బతీస్తే... మరోసారి మార్కెట్‌లో ధర లేక అప్పులపాలవుతున్నారు. కేవలం నారు నాటుకునే సమయంలోనే రూ. 15 వేల నుంచి రూ. 20 వేలు ఖర్చు అవుతోందని... పంట చేతికి వచ్చే సమయానికి రూ. 50 వేలు పెట్టుబడి అవుతోందని రైతులు తెలిపారు.
అన్నీ అనుకూలిస్తే 70 క్వింటాళ్ల దిగుబడి వస్తుందని తెలిపారు. కానీ, ప్రస్తుతం క్వింటాల్ ధర రూ. వెయ్యి లోపే పలుకుతుండటం వల్ల పెట్టుబడి రానీ పరిస్థితి ఏర్పడిందని వాపోతున్నారు.
ఇనామ్ విధానం...
జనవరిలో క్వింటాల్ ఉల్లిగడ్డ ధర రూ. 3 వేల నుంచి రూ. 5వేల వరకు పలికింది. వారం క్రితం వరకు రూ. 1,500 ఉండగా ప్రస్తుతం రూ. 900 మించడం లేదు. నెలల తరబడి శ్రమించి పండించిన పంటను మార్కెటుకు తీసుకువచ్చే సమయానికి ధర పడిపోతుందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గిట్టుబాటు ధర కల్పించాలన్న ఉద్దేశంతో తెచ్చిన ఇనామ్ విధానం న్యాయం చేయలేకపోతుందని తెలిపారు.