వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో సాగునీటి ప్రాజెక్టులు నిండుకుండలా మారాయి. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం కొత్తూరు(బి) నారింజ ప్రాజెక్టు ఎగువ నుంచి వస్తున్న నీటితో నిండి పోయి వరద నీరు గేట్ల మీదుగా పొంగిపొర్లుతోంది.
భారీ వర్షాలతో నిండుకుండలా మారిన నారింజ ప్రాజెక్టు
సంగారెడ్డి జిల్లాలో భారీగా కురుస్తున్న వర్షాలతో నారింజ ప్రాజెక్టుకు జలకళ సంతరించుకుంది. ఎగువ నుంచి వస్తున్న నీటితో నిండి పోయి వరద నీరు గేట్ల మీదుగా పొంగిపొర్లుతోంది.
భారీ వర్షాలతో నిండుకుండలా మారిన నారింజ ప్రాజెక్టు
గత నాలుగేళ్లుగా వర్షాభావంతో చుక్క నీరు లేక.. ఏడారిని తలపించిన నారింజ ప్రాజెక్టు భారీగా కురుస్తున్న వర్షాలతో జలకళ సంతరించుకుంది. ప్రాజెక్టులో నీరు చేరడం వల్ల పలు మండలాల్లోని సుమారు 30 గ్రామాల్లో భూగర్భ జలాలు మట్టం పెరుగుతాయని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఒక టీఎంసీ నీటి సామర్థ్యం కలిగిన ప్రాజెక్టు నిండిపోవడం వల్ల ఎగువ నుంచి వస్తున్న వరద నీరు కర్ణాటక వైపు వెళ్తోంది.