తెలంగాణ

telangana

ETV Bharat / state

పాఠశాలకు వెళ్లి వస్తుండగా.. - One school Boy died in accident

పాఠశాలకు వెళ్లి వస్తానన్న కుమారుడిని డీసీఎం రూపంలో మృత్యువు కబళించింది. ఆ చిన్నారి తల్లిదండ్రుల్ని శోకసంద్రంలో ముంచింది. ఈ విషాదకర ఘటన సంగారెడ్డి జిల్లా వీరారెడ్డిపల్లిలో చోటుచేసుకుంది.

పాఠశాలకు వెళ్లి వస్తుండగా..

By

Published : Mar 19, 2019, 6:23 AM IST

Updated : Mar 19, 2019, 7:31 AM IST

పాఠశాలకు వెళ్లి వస్తుండగా..
పాఠశాలకు వెళ్లి తిరిగి వస్తానన్న కుమారుడిని డీసీఎం రూపంలో మృత్యువు కబళించింది. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు కన్నీరు మున్నీరయ్యారు. ఈ విషాదకర ఘటన సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం వీరారెడ్డిపల్లి సమీపంలో జరిగింది. కానుకుంట హైస్కూల్లో మల్లికార్జున్​ అనే విద్యార్థి తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. రోజులాగే సైకిల్​పై పాఠశాలకు వెళ్ళి తిరిగి వస్తుండగా ఎదురుగా వస్తున్న డీసీఎం బాలుడి సైకిల్​నుబలంగా ఢీకొంది. తీవ్రగాయాలైన మల్లికార్జున్​ను నగరంలోని మెడిసిటీ ఆస్పత్రికి తరలించారు. ఈలోపే బాలుడు మరణించినట్లు వైద్యులు తెలిపారు. ముగ్గురు పిల్లల్లో ఉన్న ఒక్కగానొక్క కుమారుడు చనిపోవడం వల్లతల్లిదండ్రులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Last Updated : Mar 19, 2019, 7:31 AM IST

ABOUT THE AUTHOR

...view details