సంగారెడ్డి జిల్లా నాగల్గిద్ద మండలంలోని ఇరాక్పల్లి శివారులోని ఒక చెట్టుకు ఉరేసుకుని గుర్తు తెలియని వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. శివారులోని చెట్టుకు వేలాడుతున్న గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని స్థానికులు గమనించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. వారు ఘటనాస్థలికి చేరుకుని విచారణ చేపట్టారు. ఆ వ్యక్తి ఉరి వేసుకున్నాడా.. లేక ఎవరైనా హత్య చేసి వేలాడదీశారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
అనుమానాస్పద స్థితిలో గుర్తుతెలియని వ్యక్తి మృతి - sangareddy district
గుర్తుతెలియని వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన సంగారెడ్డి జిల్లా ఇరాక్పల్లిలో చోటుచేసుకుంది. చెట్టుకు వేలాడుతున్న మృతదేహాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారమందించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
అనుమానాస్పద స్థితిలో గుర్తుతెలియని వ్యక్తి మృతి