సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లో మరో కరోనా పాజిటివ్ కేసు నమోదైంది. దీంతో ప్రజల్లో భయాందోళన మొదలైంది. జహీరాబాద్ పట్టణంలోని మూసానగర్ కాలనీకి చెందిన 38 ఏళ్ల వ్యక్తికి కొవిడ్-19 పాజిటివ్ కేసు వెలుగులోకి రావడం వల్ల కాలనీలో రాకపోకలు పూర్తిగా నిషేధించారు.
జహీరాబాద్‌లో కరోనా కేసు.. రెడ్‌జోన్‌లోకి మూసానగర్ కాలనీ
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లో కొత్తగా కొవిడ్ పాజిటివ్ కేసు నమోదైంది. మూసానగర్ కాలనీకి చెందిన 38 ఏళ్ల వ్యక్తి మహమ్మారి వచ్చినట్లు అధికారులు స్పష్టం చేశారు. దీంతో ఆ కాలనీ సహా అర కిలోమీటరు పరిధి వరకు రెడ్‌జోన్‌గా ప్రకటించారు. ఆర్డీవో రమేశ్ బాబు, మున్సిపల్ కమిషనర్ తహసీల్దార్ నాగేశ్వరరావు, పోలీసు అధికారులు మూసానగర్ కాలనీలో పర్యటించి ప్రజలకు సూచనలు చేశారు.
జహీరాబాద్‌లో కరోనా కేసు.. రెడ్‌జోన్‌లోకి మూసానగర్ కాలనీ
కాలనీ సహా అర కిలోమీటరు పరిధిలోకి వచ్చే అన్ని ఇళ్లు, కాలనీలను రెడ్ జోన్లోకి చేరుస్తూ బారికేడ్లు ఏర్పాటు చేశారు. కరోనా పాజిటివ్ కేసు నమోదు విషయం శుక్రవారం ఉదయం వెలుగులోకి వచ్చింది. జహీరాబాద్ ఆర్డీవో రమేశ్ బాబు, మున్సిపల్ కమిషనర్ తహసీల్దార్ నాగేశ్వరరావు, పోలీసు అధికారులు మూసానగర్ కాలనీలో పర్యటించి ప్రజలకు సూచనలు చేశారు.