తెలంగాణ

telangana

ETV Bharat / state

కుటుంబ కలహాలతో వ్యక్తి ఆత్మహత్య - పుల్కల్ మండలం గోంగులుర్ గ్రామానికి చెందిన గంగారాం

సంగారెడ్డి జిల్లాలో ఓవ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పుల్కల్ మండలం గోంగులుర్ గ్రామానికి చెందిన గంగారాం.. మద్యానికి బానిసై భార్యతో గొడవపడేవాడు. రోజు మాదిరిగానే గొడవ చేస్తుండగా స్థానికులు మందలించారు. మనస్థాపానికి గురైన గంగారాం.. చెట్టుకు ఉరివేసుకున్నాడు. భార్య ఫిర్యాదుతో పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

One Man committed suicide in Sangareddy district.
'కుటుంబ కలహాల వల్ల ఓవ్యక్తి ఆత్మహత్య'

By

Published : Jun 1, 2020, 10:34 PM IST

కుటుంబ కలహాల వల్ల ఓవ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన సంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. పుల్కల్ మండలం గోంగులుర్ గ్రామానికి చెందిన గంగారాం అనే వ్యక్తి కూలీ చేసి కుటుంబాన్ని పోషించేవాడు. లాక్ డౌన్ కారణంగా ఉపాధి కరవైంది. కొంతకాలంగా మద్యానికి బానిసైన గంగారాం.. తరచు ఇంట్లో భార్యతో గొడవపడేవాడు.

చెట్టుకు ఉరివేసుకున్న గంగారాం

రోజు మాదిరిగానే మద్యం సేవించి వచ్చి భార్యతో వాగ్వాదానికి దిగాడు. స్థానికులు కలుగజేసుకుని మందలించారు. మనస్థాపానికి గురైన గంగారాం.. చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి:జూన్ 2న తెలంగాణ డిమాండ్స్ డే: సీపీఐ కార్యదర్శి భూమన్న

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details