సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం మన్‌సాన్‌పల్లికి చెందిన భారతమ్మ(65)కొన్నాళ్ల కిందట హైదరాబాద్‌లోని బంధువుల ఇంటికి వెళ్లింది. బస్సులు ప్రారంభం కావటం వల్ల తిరిగి గ్రామానికి వచ్చింది. కరోనా పరీక్షలు చేయించుకుని రావాలని గ్రామస్థులు చెప్పగా.. ఇన్నాళ్లు అక్కడక్కడ తిరుగుతూ గడిపింది.
కరోనాపై అనుమానం.. వృద్ధురాలి ప్రాణం తీసింది! - corona update
బంధువుల ఇంటికి వెళ్లి వచ్చిన ఓ వృద్ధురాలిని ఆ ఊరు జనం దూరం పెట్టారు. కరోనా పరీక్షలు చేయించుకుని వస్తేనే ఊళ్లోకి రానిస్తామన్నారు. గ్రామస్థులంతా సూటిపోటి మాటలనటం వల్ల తీవ్ర మనోవేదనకు గురైన ఓ వృద్ధురాలు ఆస్పత్రిలో చికిత్స పొందతూ మృతి చెందిన ఘటన సంగారెడ్డిలో జరిగింది.
కరోనాపై అనుమానం.. వృద్ధురాలి ప్రాణం తీసింది!
సరైన తిండి లేకపోవడంతోపాటు ఆస్తమా, జ్వరంతో బాధపడుతున్న వృద్ధురాలిని మంగళవారం రోజు ఆశా కార్యకర్త గుర్తించింది. జిల్లా కేంద్ర ఆసుపత్రిలోని ఐసోలేషన్ వార్డుకు తరలించారు. వైద్య సేవలు అందించిన తర్వాత భోజనం చేస్తున్న సమయంలో గుండెపోటు వచ్చి ప్రాణాలు కోల్పోయింది. బాధితురాలు అవివాహిత అని తెలిసింది. బంధువులకు సమాచారం ఇస్తే స్పందించక పోవటం వల్ల పోలీసులకు తెలిపినట్లు ఆస్పత్రి సిబ్బంది పేర్కొన్నారు.
ఇవీ చూడండి:కరోనా వేళ కూలీల ఆశాదీపం 'ఉపాధిహామీ'
Last Updated : May 27, 2020, 4:51 PM IST